ఇక ఇన్సూరెన్స్‌ కంపెనీల వంతు

 

మూడు కంపెనీల విలీనానికి చర్యలు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): బ్యాంకుల విలీనం తరవాత ఇప్పుడు ఇన్సూరెన్స్‌ కంపెననీల విలీనానాఇకి అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వరంగంలోని మూడు బీమా సంస్థల విలీనం వచ్చే ఏడాది

పూర్తికానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలను విలీనం చేయనున్నట్లు 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. ఈ విలీనాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే పూర్తిచేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గత శుక్రవారం ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో ఈ విలీన పక్రియ కొనసాగుతున్నదని, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తికానున్నదని తెలిపింది. మార్చి 31, 2017 నాటికి ఈ మూడు కంపెనీలు 200 బీమా ఉత్పత్తులను విక్రయిస్తుండగా, మొత్తం ప్రీమియం వసూళ్లు రూ.41, 461 కోట్లుగా ఉన్నాయి. 44 వేల మంది సిబ్బంది కలిగిన ఈ మూడు సంస్థల నికర విలువ రూ.9,243 కోట్లుగా నమోదైంది. విలీనం తర్వాత ఏర్పడనున్న ఈ సంస్థ.. నాన్‌-లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో రూ.1.2 -1.5 లక్షల కోట్ల నికర విలువతో అతిపెద్ద సంస్థగా అవతరించనున్నది. ఇందుకు సంబంధించి త్వరలో కన్సల్టెంట్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించబోతున్నది. మూడు కంపెనీల విలీనం తరవాత అతిపెద్ద సంస్థగా అవతిరంచనుంది. దీనికి సంబంధించి ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేకుండా విలీన ప్రక్రియను పూర్తి చేయనున్నారు.