ఇక మ్యూజియంగా వందేళ్లనాటి పార్లమెంట్‌ భవనం

వర్షాకాల సమావేశాలతో పాభవనానికి ముగింపు
శీతాకాల సమావేశాల్లో కొత్త పార్లమెంట్‌కు శ్రీకారం

న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి ): బ్రిటిష్‌ పాలకుల కాలంలో నిర్మితమైన వందేళ్ల నాటి చరిత్రాత్మక పార్లమెంట్‌ భవనంలో చివరి పార్లమెంట్‌ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 12 వర కు ఇక్కడ పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగనున్నాయి. కొత్తగా నిర్మితమవుతున్న భవనంలో ఇక శీతాకాల పార్లమెట్‌ సమావేశాలు జరుగుతాయి. స్పీకర్‌ ఓం బిర్లా ఈ విషయాన్నిఇటీవలే చూచాయగా వెల్లడిరచారు. కొత్త భవనంపై భారత చిహ్నాన్ని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టించారు కూడా. మొత్తంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులకు కూడా పాత పార్లమెంట్‌ భవనంతో అనుబంధం తీరనుంది. ఈ నెల 24 రాష్ట్రపతి పదవి నుంచి కోవింద్‌ దిగిపోనున్నారు. ఆగస్ట్‌ 10న ఉపరాష్ట్రపతిగా
వెంకయ్యనాయుడు పదవీకాం ముగియనుంది. ఆగస్ట్‌ 13 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరగునున్నాయి.
డిసెంబరులో జరిగే శీతాకాల సమావేశాలు సెంట్రల్‌ విస్తాలో భాగంగా మోదీ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన పార్లమెంట్‌ భవనంలోనే జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇప్పటికే ప్రకటించారు. పాతభవనాన్ని లైబ్రరీగా లేదా మయూజియంగా మారుస్తారన్న ప్రచారం ఉంది.17వ లోక్‌సభ 9వ సమావేశాలు, 257వ రాజ్యసభ సమావేశాలతో పాటు నూతన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక పాత పార్లమెంట్‌ భవనంలోనే జరగనుంది. సమావేశాల తొలిరోజే రాష్ట్రపతి పదవికి, ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్యనాయుడు పదవీకాలం కూడా పాత పార్లమెంట్‌ భవనంలోనే ముగిసిపోనుంది. కాగా పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. భారీ విధ్వంసక ఆయుధాల నిషేధిత చట్ట సవరణ బిల్లు, బాల్య వివాహాల నిషేధ చట్ట సవరణ బిల్లు, యాంటీ డోపింగ్‌ బిల్లు, వన్యప్రాణుల పరిరక్షణ చట్ట సవరణ బిల్లు, బయోలాజికల్‌ డైవర్సిటీ చట్ట సవరణ బిల్లులను గతంలో ప్రభుత్వం పార్లమెంటరీ స్థాయీ సంఘాల పరిశీలనకు పంపించింది. కమిటీలు ఆ బిల్లులను పంపిస్తే వర్షాకాల సమావేశాల్లో వాటిని ఆమోదించే అవకాశం ఉంది. విద్యుత్తు పంపిణీలో అనేక ప్రైవేట్‌ కంపెనీలను ప్రవేశపెట్టే కీలకమైన విద్యుత్తు సవరణ బిల్లు, ప్రత్యేక అభివృద్ధి మండలాలకు మరింత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే స్వేచ్ఛను కల్పిస్తున్న దేశ్‌ బిల్లులను ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నారు. అయితే విద్యుత్‌ పంపిణీ బిల్లు కార్పొరేట్లకే ప్రయోజనం కల్పిస్తుందని తృణమూల్‌తో సహా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. సైన్యంలో 75శాతం మందికి నాలుగేళ్లు మాత్రమే పనిచేసే అవకాశం కల్పించే అగ్నిపథ్‌నూ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించేందుకు సిద్ధమవుతున్నాయి. అంతాగాకుండా సింహాల చిహ్నంలో మార్పులపైనా విపక్షాలు మండిపడుతున్నాయి. ఇవన్నీకూడా చర్చకు దారితీయవచ్చు.