ఇచ్చోడ లో బేడ బుడగజంగాలు గ్రామ దేవతలకు పూజలు

ఇచ్చోడ ఆగస్టు 23 (జనంసాక్షి) ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక శుభాష్ నగర్ బేడ బుడగజంగం కాలనీ వాసులు మంగళవారం రోజున గ్రామ దేవతలకు పూజలు చేశారు గ్రామ ప్రజలంతా పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని  వారు పలు ఆలయలల్లో పూజలు నిర్వహించారు ఎన్నో శతబ్దాలనుండి ఆనవాయితీగా వచ్చే ఈ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మసాం వారు ప్రవిత్రమాసంగా భావిస్తారు అదే మాసం లో గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తారు ఎంతో ప్రవీత్రంగా ఉపవాసలు ఉండి పూజలకు ఒక రోజు ముందుగా రాత్రిలో బుర్రకథ కళాకారులచే  బుర్రకథ రూపంలో కథలు నిరావహిస్తారు జాగారం గా రాత్రి గడిపి అనంతరం తెల్లవారుజామున పిల్లపాపలతో అందరు కలిసి కళాకారుల  వేశాధారణలతో బుర్రకథ పాటలు పాడుతూ భజనలు చేస్తూ తంబుర డిమికి ల చప్పుళ్లతో దేవతల నామస్వారాలను స్మరించుకుంటూ ఊరేగుంపుగా వెళ్లి గ్రామ దేవతల ఆలయాలల్లో పూజలు నిర్వహిస్తారు అనంతరం కాలనిలో అన్నదానం నిరావహిస్తారు ఈ కార్యక్రమంలో బేడ బుడగజంగం కుల పెద్దలు సిరిగిరి రాములు ఇర్నాల సాయన్న సంఘం పెద్దమనుషులు కడమంచి హన్మంతు ఆకుల గంగారాం కడమంచి దశరథ్ కడమంచి చిన్న భీమన్న యువకులు మరియు సంఘం అధ్యక్షులు సిరిగిరి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు పేర్ల గంగన్న ప్రధాన కార్యదర్శి కడమంచి లక్ష్మణ్ కె. అర్జున్ కళాకారులు గడ్డం అర్జున్ తూర్పటి నారాయణ తూర్పటి విలాస్ కాలనీ వాసులు పాల్గొన్నారు