ఇటుక బట్టి యజమానులపై. సులేమాన్ ఫారం సర్పంచ్ దౌర్జన్యం
ఇటుక బట్టీలకు పరిమిషన్ ఇచ్చే అధికారం సర్పంచ్ కు లేదు……
పరిమిషన్ ముసుగులో దోపిడీ….
రుద్రూర్ (జనంసాక్షి):
రుద్రూర్ మండల కేంద్రంలోని సులేమాన్ నగర్ గ్రామంలో గత 15 సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఓ ఇటుక బట్టి యజమాని పై సర్పంచ్ దౌర్జన్యం చేస్తున్నారని ఆ ఇటుక బట్టి యజమాని మీడియా ద్వారా తెలియజేశారు. సాలంపూర్ శివారులోని ఇటుక బట్టీకి సులేమాన్ నగర్ గ్రామపంచాయతీ ద్వారా పర్మిషన్ కూడా ఇచ్చారట అయితే విషయానికి వెళ్తే సాలంపూర్ శివారులో గల ఇటుక బట్టి కి పర్మిషన్ ఇచ్చే అధికారం సులేమాన్ నగర్ గ్రామపంచాయతీ కి ఉందా.గ్రామపంచాయతీ ద్వారా టాక్స్ ఇవ్వాలి కానీ పరిమిషన్ ఇచ్చే అధికారం కేవలం మైన్స్ కే ఉంటుందాని రుద్రూర్ మండల కేంద్రంలోని రెవిన్యూ అధికారులు తెలిపారు . మరి పర్మిషన్ ముసుగులో ఆ బట్టి యజమాని దగ్గర డబ్బులు తీసుకొని రసీదు సైతం ఇచ్చారు. గత కొద్ది రోజుల క్రితం గ్రామపంచాయతీ ద్వారా ఓ మీడియేటర్ ఇటుక బట్టి యజమాని దగ్గరికి వచ్చాడట ఆయన దగ్గరికి వచ్చి మీ ఇటుక బట్టి ప్రభుత్వ స్థలంలో ఉంది ఆ ఇటుక బట్టిని మీరు మూసివేయండి లేనిపక్షంలో గ్రామపంచాయతీ చర్యలు తీసుకుంటుమని ఆ మీడియేటర్ వచ్చి ఇటుక బట్టి యజమానిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఇటుక బట్టి యజమాని సంబంధిత రెవిన్యూ అధికారులకు సంప్రదించగా ఇటుక బట్టీలకు పర్మిషన్ ఇచ్చే అధికారం కేవలం మైన్స్ అధికారులకే ఉంటుందని గ్రామపంచాయతీకి పర్మిషన్ ఇచ్చే అధికారం లేదని రుద్రూర్ మండల కేంద్రంలోని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. పట్టపగలే దోపిడీకి పాల్పడుతున్న సులేమాన్ నగర్ గ్రామపంచాయతీ పై మరియు గ్రామపంచాయతీ అధిపతి అయినటువంటి సర్పంచి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఇటుక బట్టి యజమాని సంబంధిత అధికారులతో కోరుతున్నాడు.