ఇరువురి బాధిత కుటుంబాలను పరామర్శ.
జనంసాక్షి న్యూస్ నెరడిగొండ:
మండలంలోని చిన్న బుగ్గారాం గ్రామానికి చెందిన శివులాల్ దంపతుల కుమారుడు రోహిదాస్ ఇటీవల క్యాన్సర్ తో చనిపోయారు.ఈ విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ అనిల్ జాదవ్ ఎంపిపి రాథోడ్ సజన్ లు సోమవారం రోజున కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే మండలంలోని కుంటాల గ్రామానికి చెందిన నాగేష్ ఇటీవలే చనిపోయారు.వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.జడ్పీటీసీ ఎంపీపీ తోపాటు మండల సర్పంచ్లు జాధవ్ సుభాష్ జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్. లింబాజి గణేశ్ తదితరులు ఉన్నారు.