ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలి.

మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య.
తాండూరు ఆగస్టు 11 (జనం సాక్షి) పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోట్రిక విజయలక్ష్మి వెంకటయ్య పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి నివాసంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని తన నివాసంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ కౌన్సిలర్ కురాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోదరీ సోదర భావానికి నిలువెత్తు నిదర్శనం రాఖీ పండుగ అన్నారు. ప్రేమ, కరుణ, సహన సీలతకు రాఖీలు నిదర్శనమన్నారు.
అన్నాచెల్లెల్లు, అక్కా త‌మ్ముళ్ల అనుబంధానికి ప్ర‌తీక‌గా నిలిచే ర‌క్షాబంధ‌న్ కుల మ‌తాల‌కు అతీమ‌ని అన్నారు. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం రాఖీలు క‌ట్టి స్వీట్లు తినిపించారు.
అనంతరం స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా
మువ్వన్నెల పతాకాన్ని అందజేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై జెండాను ఎగురవేయాలని తెలిపారు. ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలని కోరారు. ఈసందర్భంగా ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌ల‌ను తెలిపారు.