ఈరోజు బైంసా పట్టణంలోని హర్యాలీ కన్వెన్షన్ లో ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కరుణ కాలం నుండి రెండు సంవత్సరాలు ఇంటికి పరిమితమైన విద్యార్థులకు చదువు పట్ల జీవితం పట్ల ఆసక్తి తగ్గినందుకుగాను వాళ్ల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఆనందిత ఫౌండేషన్. ఈ ఉచిత సమగ్ర శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ముధోల్ ఎమ్మెల్యే గడ్డి గారి విట్టల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి తమ జీవితాల్లో ఒక ఆశయాన్ని పెట్టుకోవాలని ఆ ఆశయం కోసం ప్రతిక్షణం తపన పడుతూ ఆశాన్ని సాధించాలని విద్యార్థులు తమ జీవితంలో ముందుకెళ్లి తల్లిదండ్రులకు అదే విధంగా సమాజం పట్ల గౌరవంతో ఉండాలని చెప్పడం జరిగింది ఏఎస్పి కిరణ్ కారే మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థులకు టైం అనేది చాలా విలువైందని ఆ టైము మళ్లీ తిరిగి రాదని ఆ టైంలో విద్యార్థులందరూ క్రమశిక్షణగా ఉంటూ చదువుకొని మంచి స్థాయిలోకి రావాలని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల ఈ సమాజం పట్ల గౌరవంతో ఉండాలని అదేవిధంగా ప్రతి విద్యార్థి ఒక ఆశయాన్ని పెట్టుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు అదేవిధంగా విద్యార్థులకు ఉచిత సమగ్ర శిక్షణ ఇవ్వడానికి వచ్చినటువంటి శ్రీహరి తిరునగరి దాదాపు రెండు గంటలు క్లాస్ తీసుకుని ప్రత్యేక విద్యార్థికి జీవితం పట్ల ఒక ఆశయాన్ని ఏర్పరచుకున్నట్టు చేశారు ప్రతి విద్యార్థికి జీవితం అనేది ఏ విధంగా ఉండాలో బోధించారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే.ఏఎస్పీ. ఆనందిత ఫౌండేషన్ చైర్మన్ వాడేకర్ లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కడారి నరేష్. 2000 మంది విద్యార్థులు. విద్యార్థుల తల్లిదండ్రులు. యువకులు. ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు