ఈరోజు ముప్కాల్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మె
బాల్కొండ బహుజన సమాజ్ పార్టీ సంఘీభావం తెలపడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు గుంటి బెనర్జీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శాసనసభలో 2020 సెప్టెంబర్ 9న వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేసి అమలు చేయాలని చెప్పారు అర్హత కలిగిన ప్రమోషన్లు కల్పించాలని అన్నారు గత 50 సంవత్సరాలు పైబడిన వారు ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బిఎస్పి అధ్యక్షులు గుంటి బెనర్జీ, నియోజకవర్గ ఇన్చార్జి పబ్బా సంతోష్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుంకే విక్రమ్ ఉపాధ్యక్షులు రాంజీ మండల అధ్యక్షులు పోలా ఉదయ్ ,ముప్కాల్ మండల వివిధ గ్రామాల వీఆర్ఏలు ముప్కాల్ వీఆర్ఏ మండల అధ్యక్షులు ముత్యం, మరియు వీఆర్ఏలు నరసయ్య, విశాల్, శేఖర్, శ్రవణ్,సంజీవ్ రాజేశ్వర్,సురేష్, పోశెట్టి, స్వప్న, స్వరూప, లక్ష్మి, తదితర సహాయకులు ధర్నాలో పాల్గొన్నారు




