ఈశ్వర ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు.

భక్తిశ్రద్ధలతో భగవంతున్ని ప్రార్థిస్తూ భజనలు.
తాండూరు అగస్టు 28(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బశవేశ్వరనగర్ లో కొలువుదీరిన చెరువెంటీశ్వర ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయం లో ఆదివారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వీరశైవ సమాజం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం పాల్గొని స్వామివారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శివశంకర్ స్వామి వేదమంత్రోచరణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ప్రసాదం అందజేశారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్ర మంలో వీరశైవ సమాజా అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, కార్యదర్శి గాజుల శాంత్ కుమార్ , కోశాధికారి కందనెల్లి ప్రకాశం,ఆలయ కమిటీ అధ్యక్షులు వాలి శాంత్ కుమార్ ,కార్యదర్శి జొన్నల బసవరాజు ,వినోద్ కుమార్,.శ్రవణ్ కుమార్ ,అలయ అర్చకులు శివశంకర్ స్వామి, పారాయణ సమితి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.