ఈ నెల 16న జరిగే అఖిలపక్ష సమావేశాన్ని జయప్రదం చేయండి. ధనుంజయ నాయుడు.

 

 

 

 

 

 

 

 

 

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్:ఈనెల 16న నేరేడుచర్లలోని పాల్వాయి రమేష్ స్థలం ఆవరణలో ఉదయం 11 గంటలకు జరుగు మిర్యాలగూడ జిల్లా సాధనకు ఏర్పాటైన అఖిలపక్ష సమావేశాన్ని జయప్రదం చేయాలని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు ధూళిపాళ ధనుంజయ నాయుడు కోరారు.మంగళవారం నేరేడుచర్లలో ఆయన మాట్లాడుతూ నేరేడుచర్ల,పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లోని అన్ని రాజకీయ పక్షాలు, అన్ని ప్రజా సంఘాలు, వివిధ కులవృత్తి సంఘాలు, అన్ని వర్గాల, అన్ని రంగాల ప్రజలు ఈ సమావేశంలో పాల్గొనాలని ఆయన కోరారు.మిర్యాలగూడ జిల్లా కావాలనుకునే ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలన్నారు.ఈ సమావేశానికి చేగొండి మురళి, జ్వాలా వెంకటేశ్వర్లు తో పాటు అనేకమంది ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.