ఈ నెల 9న రాజ్‌కోట్‌లో తొలి టెస్ట్ మ్యాచ్
స్వదేశంలో భారత్ మరో సిరీస్‌లో సత్తా చాటేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది. ఈ నెల 9న రాజ్‌కోట్‌లో తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనున్న విషయం తెల్సిందే. న్యూజిలాండ్‌పై టెస్ట్ సిరీస్‌ను, వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ జట్టు విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇంగ్లండ్ సిరీస్‌పై కన్నేసింది. కివీస్‌పై 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో జట్టు పటిష్టంగా ఉంది. నెంబర్ వన్ స్థానం మరింత కాలం పదిలం చేసుకోవాలంటే స్వదేశంలో జరిగే సిరీస్ విజయాలే కీలకపాత్ర పోషిస్తాయి. ఇంగ్లాండ్‌కు ధీటుగా రాణిస్తున్న యువ ఆల్‌రౌండర్లతో కోహ్లీ సేన రంగంలోకి దిగుతోంది.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని బృందం శనివారం రాజ్‌కోట్‌కు చేరుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ ఈ నెల 9న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్‌సిఎ) ఆధ్వర్యంలో నూతన స్టేడియం ఖాందేరిలో ప్రారంభం కానున్న విషయం తెల్సిందే.