ఉక్కు పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ది

వీటితోనే నిరుద్యోగ యువతకు ఉపాధి
మోడీ ఉక్కు సంకల్పం ముందు ఓడిన జనం
న్యూఢల్లీి,సెప్టెంబర్‌25 (జనంసాక్షి)  దేశంలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మాటెల ఉన్నా ..ఉన్న సంస్థలను తెగనమ్మడం ద్వారా నిరుద్యోగ యువత ఆశలపై కేంద్రంలోనీ మోడీ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కొత్తగా ఉద్యోగాల కల్పకు గల అవకాశాలను లేకుండా చేస్తోంది. కొత్తగా సంస్థల ఏర్పాటు సాధ్యం కాదనుకుంటే దేశంలో లక్షలాదిగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కదు. అలాగే ఉన్న సంస్థలను బలోపేతం చేయడం ద్వారా లక్షలాదికి ఉద్యోగావకాశాలు కల్పించాల్సిన కేంద్రం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పనంగా కట్టబడుతున్నారు. విశాఖ ఉక్కులాంటి దిగ్గజసంస్థలను తెగనమ్మేయడం వల్ల కొత్తగగా నిరుద్యోగం ప్రబలే ప్రమాదం ఉంది. కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదని చెబుతున్న కేంద్రం ఉన్న ఉక్కు ఫ్యాక్టరీని అనుయాయులకు కట్టబెట్టే యత్నాలు దుర్గార్గపు చర్యగానే చూడాలి. అలాగే స్థానికంగా లభ్యమవుతున్న ముడిసరుకుని విదేశాలకు తరలిస్తున్న తీరును అడ్డుకునేలా లేదు. కడప, బయ్యారం ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యం కాదంటూ సెయిల్‌ 2014 డిసెంబర్‌లో ఇచ్చిన నివేదికను 2018 జూన్‌ 13న సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌ దాఖలు చేయడంలోనే కేందప్రభుత్వ దగా స్పష్టమవుతోంది. ఈ అంశంపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎంఎంటిసి, మెకాన్‌ సంస్థల ప్రతినిధులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను 2016 అక్టోబర్‌లో నియమించారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో అపారమైన ఇనుప ఖనిజ నిల్వలున్నాయనీ, అనంతపురం గనుల ఖనిజం నాణ్యత ఎక్కువనీ మెకాన్‌ సంస్థ నిర్ధారించింది. కడప ఉక్కు కర్మాగారానికి ఆ ఖనిజ నిక్షేపాలను కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధతనూ తెలిపింది. వీటన్నిటి ఆధారంగా కడప ఉక్కు కర్మాగార ఏర్పాటు సాధ్యమేనని మెకాన్‌ సంస్థ అప్పట్లో సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయినా సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో 2017 డిసెంబర్‌నాటి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం గురించి మాత్రమే పేర్కొనడం వాస్తవాన్ని కప్పిపుచ్చడానికే అన్నది గమనించాలి. ఇలాంటి విషయాల్లో కాలయాపన చేసి చేతులెత్తేయడం ద్వారా బృహత్తర లక్ష్యాన్ని దెబ్బతీయడం కాకా మరోటి కాదు. ఇలా చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు ఉన్న అవకాశాలను దెబ్బతీసారు. నిజానికి ఇక్కడి ముడిసరుకును ఉపయోగించి విశాక ఉక్కు ఫ్యాక్టరీని కూడా బలోపేతం చేయవచ్చు. కానీ అనుయాయులకు ఇచ్చిన మాట కోసం ప్రజల ప్రయోజనాలు ఏమైనా ఫర్వాలేదన్న ధోరణితో ఉన్నారు. కడప ఉక్కుపట్ల కేంద్రం ఎంత ప్రతికూలంగా వుందో ..విశాఖ ఉక్కును రక్షించడంలోనూ అంతే ప్రతికూలంగా ఉందని స్పష్టమవుతోంది. రైల్వే జోన్‌ ఏర్పాటుపైనా బిజెపి ప్రభుత్వం దోబూచులాడుతూనేవుంది. గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు చేపట్ట వలసిన చట్ట సవరణను ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోంది. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు మూడేళ్లు మాత్రమే ఇచ్చి, తర్వాత నిలిపివేసింది. పోర్టు ఏర్పాటుకూ తిలోద కాలిచ్చింది. సంకుచిత స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు విరుద్దంగా అభివృద్ది సాగాలి. అప్పుడే ఉక్కు పరిశ్రమల ఏర్పాటు సాకారం కాగలదు. కానీ ఆ లక్ష్యం ఇప్పుడున్న నేతల్లో కానరావడం లేదు.