ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

జహీరాబాద్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని జేజే .ఫంక్షన్ హాల్లో జమియతే ఆహ్లే హాదీస్ జహీరాబాద్ శాఖ వారు హైదరాబాద్ లోని మక్కా   కంటి వైద్య  ఆస్పత్రి వారి సౌజన్యంతో  ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.కంటి పరీక్షలు చేయిన్చుకోడానికి.జహీరాబాద్ పట్టణంతో పాటు .కోహీర్. న్యాలకల్.మొగడంపల్లి. ఝారసంగం. మండలాల నుండి మహిళలు పురుషులు తరలివచ్చారు పరీక్ష కేంద్రానికి వచ్చిన వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. నిర్వాహకులు.జమియతే ఆహ్లే హాదీస్ జహీరాబాద్ శాఖ అధ్యక్షుడు అతిఖ్ హఖని మాట్లాడుతూ మక్కా హాస్పిటల్ వైద్యులు లను మరియు టెక్నీషియన్స్ లను ఇక్కడికి పిలిపించి ఒక్క రోజు కంటి చికిత్స శిబిరాన్ని పెట్టడంజరిగింది .వచ్చినా వారికి పూర్తిగా కంటి పరీక్షలు నిర్వహించి పూర్తిగ అవసరమైన వారికి కంటి అద్దాలు .మరియు మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది.కొంత మంది పేషంట్స్ లకు కంటి ఆపరేషన్స్ అవసరమని వైద్యులు సుచనమేరకు వారికి కంటి ఆపరేషన్స్ కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది అన్నారు.ఈ కార్యక్రమంలో జమియతే ఆహ్లే హాదీస్ జహీరాబాద్ శాఖ ప్రతినిధులు అప్సర్.అబ్దుల్ ఖదీర్. పర్వేజ్.సలీం. సాబేర్.మక్కా హాస్పిటల్ హైదరాబాద్ వారి వైద్య బృందం పాల్గున్నారు.