ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన
ఝరాసంగం మర్చి 7: జనం సాక్షి ఝరాసంగం మండలం లోని కుప్పానగర్ గ్రామంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం ను ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది మంగళవారం ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ తరఫున ఈతరం, న్యూ స్టార్ యువజన సంఘాల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ లక్ష్మీ బాయి, గ్రామ పెద్దలు రాజ్ కుమార్ స్వామి లు శిబిరం ను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవలు అందిస్తున్న సంస్థల సభ్యులను అభినందించారు. డా. జోహర్ కెనడీ మాట్లాడుతూ బీద పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే వారికి సేవ చేయడం ఆనందంగా ఉంటుందని, మానవ సేవయే మాధవ సేవ అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సంస్థ సభ్యులు,
మాజీ జడ్పీటిసి , పంఢరినాథ్,ఉప సర్పంచ్ రవి,రంపూరం ప్రకాష్, నర్సిములు, శంకర్, భీమన్న, చంద్రశేఖర్, చంద్రప్ప, మాణయ్య, కేషన్న, జనార్దన్, నర్సమ్మ, సతీష్ స్వామి, మదర్ థెరిసా యువజన సంఘం సభ్యులు రాజ్ కుమార్ మిత్రపాల్, ధన్ రాజ్, ప్రతాప్,రాయికోటీ నర్సిములు యువజన సంఘాల సభ్యులు సురేష్ రావ్, వేణు, తదితరులు పాల్గొన్నారు.