ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీరప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరబాద్‌లోని వాతావరణ ప్రాంతీయ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. మరో 36 గంటల్లో తెలంగాణ , రాయలసీమల్లో అక్కడక్కడ జల్లులుపడే అవకాశముందని వాతావరణకేంద్ర అధికారులు తెలిపారు.