ఉత్తీర్ణతలో తాండూరు మొదటి స్థానంలో నిలవాలి.
టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సి .రవీందర్ రెడ్డి.
తాండూరు అగస్టు 28(జనంసాక్షి)కానిస్టేబుల్
పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సి. రవీందర్ రెడ్డి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆదివారం తాండూర్ పట్టణంలోని వివిధ సెంటర్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు ఉత్తీర్ణతలో తాండూరు మొదటి స్థానంలో ముందుండాలని భగవంతున్ని ప్రార్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని కానిస్టేబుల్ రాత పరీక్షలకు వెళ్లడం గర్వకారణం అన్నారు.
కానిస్టేబుల్ వ్రాత పరీక్షల్లో ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. పరీక్షలు రాసిన ప్రతి ఒక్కరు ఉత్తీర్ణత సాధించి జిల్లాలో తాండూరు నుంచి అధిక మొత్తంలో ఉద్యోగాలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరారు.