ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి: టీఎన్జీవో
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. సకల జనుల సమ్మె కాలాన్ని స్పెషల్ క్యాజువలీ లీవ్‌గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు తక్షణమే డీఏ విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. ఉద్యోగుల నియామకాలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.