ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌, మణికొండలో మరోసారి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంచాయితీ అధికారులను, సిబ్బందిని స్థానికులు ఆడ్డుకొని ఆందోళనకు దిగారు. నిర్మాణాలు చేపట్టిన సమయంలో అధికారులు ఏంచేశారని ప్రశ్నించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.