ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానానికి ఎదగాలి

మూడు గ్రామాల విద్యార్థుల కోసం బస్ సౌకర్యం

మంత్రి నిరంజన్ రెడ్డి స్వంత ఖర్చులతో 343 విద్యార్థులకు ఉచిత బస్ పాస్ అందజేత* …

నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి

వనపర్తి బ్యూరో అక్టోబర్06 (జనంసాక్షి)

ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త వంగూరు ప్రమోద్ రెడ్డి గారు విద్యార్థులకు సూచించారు. శుక్రవారం గోపాల్ పేట మండలంలోని మున్ననూర్ గ్రామంలో 343 మంది విద్యార్థులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వంత ఖర్చులతో ఉచిత బస్ పాస్ లను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు రావాలంటే బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలను నమ్ముకుని విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు వనపర్తికి వస్తున్నారని విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేసేలా కృషి చేయాలని నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువచ్చారు. బస్సు పాస్ ల సౌకర్యం ఉంటేనే అక్కడికి బస్సు వెళుతుందని గ్రహించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన స్వంత డబ్బులతో విద్యార్థులకు బస్ పాస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడంతో మున్ననూరు, జయన్న తిరుమలాపురం, అప్పాయి పల్లి గ్రామాలకు ఉదయం సాయంత్రం విద్యార్థులకు ఇబ్బంది కాకుండా బస్సు వెళుతుందని ఆయన వివరించారు. జయ్యన్న తిరుమలాపురం గ్రామంలో 141 మంది మున్నూరు గ్రామంలో 146 మంది అప్పాయిపల్లి గ్రామంలో 59 మంది విద్యార్థులకు బస్సు పాసులను అందజేయడం జరిగిందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇప్పించిన ఉచిత బస్సు పాసులను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని ఆయన విద్యార్థులకు కోరారు. ముందుగా మున్ననూర్ గ్రామం వద్ద ఆర్టీసీ బస్ కు పూజ కార్యక్రమంను నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి బస్ లో ఆయన ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తిరుపతయ్య తదితర గ్రామాల నాయకులు పాల్గొన్నారు.