ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం మంగళవారం పోలింగ్ నిర్వహించనున్నారు. పార్లమెంట్‌హౌస్‌లో ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది.ఓటు వేయడానికి పార్లమెంట్ ఉభయసభల సభ్యులు మాత్రమే అర్హులు. ఈ ఎన్నికల్లో యూపీఏ తరపున ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అఆన్సరీ, ఎన్డీఏ తరపున భాజపా సీనియర్ నేత జశ్వంత్‌సింగ్ పోటీ పడుతున్నారు. అయితే అన్సారీ సునాయాసంగా గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉభయసభల్లో మొత్తం 788 మంది సభ్యులుండగా అన్సారీకి 500ఓట్లు పడతాయని యూపీఏ నేతలు విశ్వాసంలో ఉన్నారు.