ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలి. అరుణారాయ్
హైదరాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా 100 రోజులు ఉన్న ఉపాధి హమీ పథకాన్ని 200 రోజులకు పెంచాలని జాతీయ సలహ కమీటి సభ్యురాలు అరుణారాయ్ అభిప్రాయాపడ్డారు. ఉపాధి హమీ పథకం అమల్లో ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని అమె కొనియాడారు. సచివాలయంలో మంత్రి మాణిక్యవర ప్రసాద్‌ను కలిసిన అమె ఉపాధి హమీ అమలును పరీశిలించారు. సోషల్ అడిట్ ద్వారా ఉపాధి హమీ పథకంలో 120 కోట్ల రూపాయాల అవినితిని గుర్తించినట్లు గ్రామీణాభీవృద్ది శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం వివరించారు. ఇందులో ఇప్పటికే 30 కోట్లు రీకవరి చేశామన్నారు. సోషల్ అడిట్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్రంలో 13 మొబైల్ కోర్టుల ఏర్పటు ప్రతిపాదనలు పంపామని, ఇప్పటికే ఒకకె కోర్టు మంజురైందని వెల్లడించారు. ఇతర రాష్ట్రల్లో ఎక్కడ లేనివిధంగా ఉపాధి హమీ పథకంలో ఇక్కడ సోషల్ అడిట్ పట్ల అరుణారాయ్ సంతృప్తి వ్యక్తం చేశారు.