ఉపాధి హామీ రికార్డుల తారుమారుపై ఎంపిపి ఆగ్రహం
గుడిహత్నూర్ : జూలై 14 జనం సాక్షి)మండలంలో ఉపాధి హమీ సిబ్బంది ఉపాధీ రికార్డులను తారుమారు చేస్తున్నారని ఎంపిపి భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో టెక్నికల్ అసిస్టెంట్లు రెండు సంవత్సరాల క్రితం కూలీలకు చెల్లించిన బిల్లుల సంబంధించి ఇప్పుడు డిమాండ్ రాయడం ఏంటని ప్రశ్నించారు. మాస్టర్లలో ఓకే హ్యాండ్ రైటింగ్ తో సంతకాలు చేసి ఉండడాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బృందం తనిఖీ చేయడానికి వస్తుండడంతో తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని ఉపాధి హామీ సిబ్బంది రెండు రోజులుగా రికార్డులు సరి చేసే పనుల్లో ఉన్నారని ఆరోపించారు. టెక్నికల్ అసిస్టెంట్ల దగ్గర నుంచి రికార్డులను స్వాధీనం చేసుకుని సమావేశ మందిరానికి తాళం వేశారు. రికార్డులు స్వాధీనం చేసుకున్న విషయం తెలుసుకున్న ఏపీఓ సుభాషిణి తమ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. చిన్న తప్పే జరిగిందని మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పడంతో ఎంపీపీకి మరింత ఆగ్రహం తెప్పించింది. మీలాంటి అధికారులు ఉండడం వల్లే మండలంలో అవినీతి పెరుగుతుందని అవినీతిని ప్రోత్సహించడానికి మీకు మనసు ఎలా వచ్చిందని సామాన్య కూలీల కొట్టకోడుతు మీరు కడుపు నింపుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు. . కేంద్ర తనిఖీ బృందం ముందు ఉపాధి హామీ సిబ్బంది అవినీతి బండారం బయటపెడతాన్నారు. ఉంటూ అధికారుల అవినీతి తీరుతో నిజమైన కూలీలకు అన్యాయం జరుగుతుంద పనిచేయుని వారికి బిల్లులు మంజూరు చేస్తున్నారన్నారు.