ఉపాధ్యాయుని వెంటనే ఉరితీయాలి

సామాజిక తెలంగాణ ధూంధాం రాష్ట్ర అధ్యక్షులు మరంపల్లి రవీందర్
జనం సాక్షి కదలాపూర్
రాజస్థాన్ లో జరిగిన దళిత విద్యార్థి హత్య నిరసిస్తూ ఆ ఉపాధ్యాయుని వెంటనే ఉరితీయాలని సామాజిక తెలంగాణ ధూంధాం రాష్ట్ర అధ్యక్షులు మారంపల్లి రవీందర్ డిమాండ్ చేశారు.మండల కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు జరిగిన రోజు కుల వివక్షతో బాబు చనిపోవడం అది బిజెపి పరిపాలిస్తున్న పాలనలో సిగ్గు చేటు అని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దినోత్సవం వేడుకల్లో అయిదు అంశాల పైన మాట్లాడారు, లింగ సమానత్వం, సామాజిక సమానత్వం గురించి మాట్లాడిన ప్రధానమంత్రి అంటరానితనం నేరమని ,కులవివక్ష పై చర్చించకపోవడం ఈ దేశ దళిత ప్రజల మనుషులను కలిసి వేసిందని అన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాబు కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలపై దళిత సమాజం ప్రతి దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఆ ఉపాధ్యాయుని బహిరంగంగా ఉరి శిక్ష విధించాలని లేదంటే దళితులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కాశి వత్తుల లక్ష్మీరాజం, హనుమంతు, శ్రీధర్ వినోద్ సాగర్ రెడ్డి బాల నీలకంఠం తదితరులు పాల్గొన్నారు.