ఉర్దూ మీడియం కళాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలి అసద్ అలీ

 

 

 

 

బిచ్కుంద జులై 20 (జనంసాక్షి)
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉర్దూ మీడియంలో ఎంపీసీ, బైపిసి, సి ఈ సి, హెచ్ ఈ సి, నాలుగు గ్రూపులను గత సంవత్సరంలోనే అనుమతి వచ్చింది. ఈ విద్యా సంవత్సరానికి గాను రెండవ సంవత్సరము కొనసాగుతుంది. అయితే ఈ ఉర్దూ మీడియంలో పాఠాలను బోధించడానికి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ గెస్ట్ ఫ్యాకల్టీని నియమించుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగిందని ఉర్దూ మీడియం కళాశాల నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కళాశాలలో తొమ్మిది గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను ఉర్దూ, మ్యాథ్స్ ,ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, హిస్టరీ బై సివిక్స్, ఎకనామిక్స్ మరియు కామర్స్. స్థానిక నియోజకవర్గపు జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఉర్దూ మీడియం కళాశాలను సాంక్షన్ చేయించడానికి ఎంతో చొరవ తీసుకొని కృషి చేసినందుకు కళాశాల బృందం మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అసద్ అలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉర్దూ మీడియంలో అడ్మిషన్లు పొంది సద్వినియోగము చేసుకోవలసిందిగా కోరారు.

తాజావార్తలు