ఉల్కాపాతంతో 400 మందికి గాయాలు

మాస్కో : రష్యాలోని యూరల్‌ పర్వత శ్రేణుల సానువుల్లో శుక్రవారం ఉదయం సంభవించిన ఉల్కాపాతంతో 400 మంది దాకా గాయపడినట్లు సమాచారం. జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. ఉల్కల చిన్న చిన్న మ్కులు తగిలి భవనాల అద్దాలు పగలడం తదితర ప్రమాదాలు సంభవించాయి. దాంతో గాజు ముక్కలు గుచ్చుకుని వందమందికి పైగా ప్రజలు ఆస్పత్రుల పాలయ్యారు. ఒక చోట జింక్‌ కర్మాగారం కప్పు మీద ఉల్క పడడంతో కార్మాగారం భవనం కుప్పకూలింది. ఒకే ఉల్క పడిందా లేక ఉల్కాపాతం సంభవించిందా అన్నది ఆర్థం కావడం లేదని, విచారణ జరుపుతుఆన్నమని అధికారులు తెలియజేశారు.