ఎందరు వెళ్లినా ఒకే మాట చెప్పాలి : హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం పేరుతో మరోసారి మోసం చేసిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీషరావు మండిపడ్డారు. అధికార పార్టీ మోసం చేసినప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన నిలవాల్సిన బాధ్యత విపక్షాలపై ఉందని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్‌ఆస్‌సీపీ, లోక్‌సత్తా, ఎంఐఎం పార్టీలు అఖిలపక్షానికి ఎంతమందిని పంపినా ఒకే అభిప్రాయం చెప్పి ప్రజాప్రతినిధులుగా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకులమా, వ్యతిరేకమా ఏదో ఒకటి చెబితే తెలంగాణ ప్రజలు ఆపార్టీలను ఎత్తుకోవాల్నో, తెలంగాణ నుంచి ఎత్తేయాల్నో నిర్ణయించుకుంటారని పేర్కొన్నారు.