ఎందరో త్యాగధనుల ఫలితమే స్వాతంత్రం
4వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ అస్లం.
తాండూర్ ఆగస్టు 11( జనంసాక్షి)ఎందరో త్యాగధనులు త్యాగాల ఫలితమే స్వాతంత్రం
లభించిందని 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మొహమ్మద్ అస్లం అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇంటింటికి జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరూ మహానుభావులు అందరికీ వందనాలని వారి త్యాగాల ఫలితమే నేడు మనం స్వేచ్ఛ తో జీవిస్తున్నామని మహానుభావులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఇంటింటి పై జాతీయ జెండా ఎగరవేసి పండుగలా జరుపుకోవాలని ప్రజలను కోరారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా దూసుకుపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.