ఎదుల్లాపూర్ ఒక ఆదర్శవంతమైన గ్రామం

శివ్వంపేట ఆగస్ట్ 8 జనంసాక్షి :  ఎదుల్లాపూర్ గ్రామం ఒక ఆదర్శవంత గ్రామంగా తయారైందని దీనిని త్వరలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కాబోతుందని సేహగల్ స్వచ్ఛంద సంస్థ సౌత్ ఇండియన్ కోఆర్డినేటర్ సలావుద్దీన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎదుల్లాపూర్ గ్రామంలో సోమవారం సేహగల్ స్వచ్ఛంద సంస్థ బృందం సభ్యులు గ్రామంలో పర్యటించి, స్థానిక సర్పంచ్ కల్లూరి కీర్తన హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వాటర్ కమిటీ గ్రామస్తులతో  సమావేశమై గ్రామంలో చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులు మహిళా సాధికారత, నీటి సంరక్షణ, ఉత్తమ వ్యవసాయం విధానాలపై ఇదివరకు తమ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన చెరువు పూడికతీత పనీ అలాగే మాసోనికుంట వద్ద నిర్మించ తలపెట్టిన చెక్ డ్యాం పై కులంకశంగా చర్చించారు. ఆ తర్వాత  సెహగల్ ఫౌండేషన్, స్థానిక గ్రామపంచాయతీ  ఆజాదికా అమృత్ మహోత్సవం సందర్భంగా ఎదుల్లాపూర్ గ్రామ శివారులోనీ తుర్కవాని కుంటకు సందర్శించి, హరితహారం కార్యక్రమంలో భాగంగా సంయుక్తంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూర్కవాని కుంటను తమ సంస్థ తరఫున సుందరీకరణ పనులకు శ్రీకారం చుడతామని, కట్టకు రెండువైపులా రాతి కట్టడం పనులు, అలాగే కట్టపై ఎల్లప్పుడూ అహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా కట్టపై కొబ్బరి, జామ, నిమ్మలతో పాటుగా పలు రకాల పండ్ల మొక్కలను కట్టకు ఇరువైపులా పెడతామన్నారు. అలాగే కట్టపై బెంచ్ లను ఏర్పాటు చేసి పాదాచారులు సేదతీరేలా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కే హెచ్ ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కల్లూరి హనుమంతరావు, పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర బటాచార్య, స్థానిక ఉప సర్పంచ్ కల్లూరి పాండురంగం,  సెహగల్ యూజీఐ కోఆర్డినేటర్ స్వాతి, లీడ్ ప్రోగ్రాం అసిస్టెంట్  వేం నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్  కల్లూరి లావణ్య, సిబ్బంది విజయ్, సంపత్, మాజీ సర్పంచ్ కొంరెల్లి సునందా రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ మ్యాకల యాదిరెడ్డి, నాయకులు పైనం నర్సింలు, భూరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.