ఎన్నికల వేళ.. అధికారుల ముమ్మర తనిఖీ
మియాపూర్‌లో 17 కిలోల బంగారం పట్టివేత
కవాడిగూడలో 2.09 కోట్ల నగదు స్వాధీనం
భారీగా బంగారం, వెండి ఆభరణాల పట్టివేత
27.540 కిలోల బంగారం.
15.650 కిలోల వెండి వస్తువులు స్వాధీనం
హైదరాబాద్,అక్టోబర్16(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా మొత్తంలో బంగారం, నగదు పట్టుబడుతున్నాయి. నిన్న రాత్రి మియాపూర్‌లో 17 కిలోల బంగారం, 17 కిలోల వెండి ఆభరణాలు పట్టుబడ్టాయి. గాంధీనగర్ కవాడిగూడలో 2.09 కోట్ల నగదు పట్టుబడిరది. వీటన్నింటిన ఆదాయశాఖ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి సంబంధిత రశీదులు లేకుండా తరలిస్తున్న.. 17 కేజీల బంగారు ఆభరణాలు, 17 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ రోజు ఉదయం మియాపూర్? చౌరస్తాలో జరిపిన తనిఖీలో రూ.14 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జప్తు చేసిన సొమ్మునంతా ఆదాయశాఖకు అప్పగించినట్లు మియాపూర్ పోలీస్ అధికారులు పేర్కొన్నారు.నగరంలోపోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో.. హైదరాబాద్ గాంధీనగర్‌లో 2 కోట్ల 9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కవాడిగూడ ఎన్టీపీసీ వద్ద.. నార్త్‌జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో టీఎస్ 09 ఎస్‌క్యూ 8507 ఒక కారుతో పాటు.. టీఎస్ 09 ఎస్‌జీ 3942 నెంబర్ గల ద్విచక్ర వాహనంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ డబ్బు తరలిస్తున్న దినేష్ కుమార్ పాటిల్, సచిన్ కుమార్, విష్ణు బాయ్ పాటిల్, జితేందర్ పాటిల్, శివరాజ్, నవీన్ బాయ్ మోడీ, మీట్ ప్రకాష్ పాటిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కారు , ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలను చూపించకుండా తరలిస్తున్నారని పోలీసులు వివరించారు. ఈ జప్తుపై గాంధీనగర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనస్థలీపురంలో ఎల్బీనగర్ ఎస్‌వోటి పోలీసులు.. జాతీయరహదారిపై తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న రూ. 29.40 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఎస్?వోటీ అధికారులు.. వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో నిర్వహించిన తనిఖీల్లో.. పోలీసులు రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సొమ్మంతా సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. నగదునంతా ఆదాయశాఖ అధికారులకు అప్పగించామన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ ఠాణా పరిధిలోని.. తాళ్లూరి చౌరస్తా వద్ద పోలీసులు రూ. 30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు వాహన తనిఖీలు చేస్తుండగా సతీష్ అనే వ్యక్తి నుంచి పట్టుకున్నారు. నగదుకు సంబందించి సరైన ఆధారాలు చూపకపోవడంతో నగదు స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖకు అప్పగిస్తామని తెలిపారు. : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో.. పట్టణానికి చెందిన వ్యాపారి నుంచి రూ. 17 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు సుదిమల్ల స్టేట్ బ్యాంక్‌లో జమ చేసేందుకు తీసుకు వెళ్తున్నట్టు వ్యాపారి చెబుతుండగా.. ఎన్నికల నిబంధనలో భాగంగా పోలీసులు సీజ్ చేసి విచారణ చేస్తున్నారు .