ఎన్ కౌంటర్ లో గాయపడిన పోలీసులను హైదరాబాద్ కు తరలింపు
హైదరాబాద్:నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన ఎదురు కాల్పుల్లో సీఐలు, గంగారాం, బాల గంగిరెడ్డికి, ఎస్సై సిద్ధయ్య, మరొక కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ తరలించారు.