ఎపికల్ జూనియర్ కళాశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.

ఎపికల్ జూనియర్ కళాశాల యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
యుఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్.
హనుమకొండ జిల్లా ప్రతినిధి జనంసాక్షి ఆగస్టు29:-
హనుమకొండ జిల్లా లోని ఎర్రగట్టుగుట్టలో ఉన్న ఏపీ కల్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకొని తక్షణమే కేసు నమోదు చేసి *విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ సోమవారం రోజున జిల్లా కలెక్టర్ కి భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించడం జరిగింది. అనంతరం జిల్లా కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వలన యజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని కనీసం ఆ కళాశాల ఎక్కడ నడుస్తుందో ఎలాంటి వసతులు ఉన్నాయో తెలియకుండానే అనుమతి ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. ఇంటర్మీడియట్ అధికారులకు కేవలం మామూళ్లకే అలవాటు పడ్డారని విచారణ చేయకుండా అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు ఇంటర్మీడియట్ అధికారులపై కలెక్టర్ గారు పూర్తిస్థాయిలో సమగ్ర విచారణ జరిపి వారిని విధులను తొలగించాలని అన్నారు అదేవిధంగా బోగస్ ఇంటర్మీడియట్ కళాశాలపై రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర విచారణ జరిపి తల్లిదండ్రులకు విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఇంటర్మీడియట్ అధికారులు ఆఫీసులకే పరిమితం అవడం వలనే ఇలాంటి ఘటన పునరావతమవుతున్నాయని మండిపడ్డారు. ఒకపక్క విద్యార్థులకు కౌన్సిలింగ్ జరుగుతున్న యజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేయడం సరికాదన్నారు ఇంటర్మీడియట్ అధికారులు పత్రిక ప్రకటనక పరిమితం అవుతున్నది తప్ప ఆచరణలో ఏ మాత్రం కూడా విచారణ జరపకపోవడం సిగ్గుచేటు అన్నారు. అన్ని జూనియర్ కళాశాల యజమానులపై సమగ్ర విచారణ జరపాలని కనీస అనుమతులేని కళాశాలకు తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. గతంలో జిల్లాలో అనేక విద్యాసంస్థలు అనుమతులు లేకుండా నడుపుతూ పరీక్షల సమయం వరకు హాల్ టికెట్ ఇవ్వకుండా వ్యవహరించారని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన పేడచెవిన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీకల్ యజమాన్యంపై విచారణ జరిపి విద్యార్థులకు తక్షణమే సర్టిఫికెట్లు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తల్లిదండ్రులను విద్యార్థులను కలుపుకొని డిఐఈఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాలకూరి హరీష్ భరత్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.