ఎమ్మార్పీ లేని సిగరెట్ ప్యాకెట్లు అమ్మకూడదు

నార్నూర్: ఎమ్మార్పీ లేని సిగరెట్ ప్యాకెట్లు అమ్మడం నేరమని జిల్లా పొగాకు నియంత్రణ విభాగం అధికారి శ్రీకాంత్ అన్నారు. సోమవారం పట్టణంలో పొగాకు నియంత్రణ తనిఖీ బృందం పర్యటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగరెట్ ప్యాకెట్లపై ధర, తయారీదారు పేరు, క్యాన్సర్ బొమ్మతో కూడిన హెచ్చరిక ఉండాలని సూచించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను విక్రయించే వ్యాపారులపై కాట్పా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాఠశాలకు 100 గజాల పరిధిలో ఎలాంటి పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని సూచించారు. ఆయన వెంట తనిఖీ బృందం సభ్యులు చిరంజీవి వెంకటస్వామి ఉన్నారు