ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హత్యకు కుట్ర

కుట్ర కేసులో భార్యాభర్తలను చేర్చిన పోలీసులు

హైదరాబాద్‌,అగస్టు6( జనం సాక్షి): ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మూడు రోజులుగా నిందితుడు ప్రసాద్‌ను విచారిస్తున్నారు. ఎమ్మెల్యేను చంపడానికే వచ్చినట్లు పోలీసుల నిర్దారించారు. హత్య కుట్రలో వాడిన కత్తిని రూ. 1800కు నాందేడ్‌లో, యూపీలో రూ.32 వేలకు తుపాకీని కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ప్రసాద్‌ బుల్లెట్ల కోసం బీహర్‌ వెళ్లాడని, అవి లభించకపోవడంతో బొమ్మ తుపాకీ కొనుగోలు చేశాడని పోలీసులు తెలిపారు. అయితే ఎమ్మెల్యే హత్యాయత్నం కుట్ర వెనక నిందితుడికి పెద్ద వ్యక్తులు సహకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసులో నిందితుడు ప్రసాద్‌ భార్య మాజీ సర్పంచ్‌ లావణ్యను ఎ2 గా పోలీసులు చేర్చారు.

తాజావార్తలు