ఎమ్మెల్యే మృతి పట్ల సంతాపం తెలిపిన పలువురి నాయకులు

హైదరాబాద్‌: కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య మృతి పట్ల స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, ఎంపీలు హరికృష్ణ సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు, సినీ నటుడు బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.