ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్ విజయవంతం.
నెరడిగొండఆగస్టు29(జనంసాక్షి):
బిజెపి హైదరాబాద్ గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇటీవల అక్రమ అరెస్టులు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా బంద్ లోభాగంగా మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ వాహిని ఏబివిపి నేరడిగోండ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజున నిర్వహించిన బంద్ విజయవంతం అయింది. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొని మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా వారూ విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ హిందూ దేవి దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హిందూ సంస్థల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
