ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి..
టి పి టి ఎఫ్ జిల్లా కార్యదర్శి. పూజారి మనోజ్
వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 22 (జనం సాక్షి)
ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని లేదా ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని వరంగల్ జిల్లా టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి మనోజ్ గౌడ్ డిమాండ్ చేశారు.
గురువారం వరంగల్ నగరంలోని పలు పాఠశాలలో సమస్యల సేకరణ , టీపీటీఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పలు పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కరీమాబాద్ లో మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ఎయిడెడ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డు మంజూరు చేయాలని కోరారు. లేనిచో కనీసం మెడికల్ రియంబర్స్మెంట్ సౌకర్యం అయినా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీకాంత్ గౌడ్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు స్వామి, పూర్వపు జిల్లా ప్రధాన కార్యదర్శి యు అశోక్, ఖిలా వరంగల్ మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బెల్లంకొండ పూర్ణచందర్, బి స్వామి, ఉపాధ్యాయులు ఐ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.