ఎయిమ్స్‌లో పారికర్‌కు చికిత్స

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌15 జ‌నంసాక్షి): గోవా ముఖ్యమంత్రి, బీజేపీ నేత మనోహర్‌ పారికర్‌ అఖిల భారత వైద్య విజ్ఞాన శాస్త్రాల సంస్థ (ఎయిమ్స్‌)లో శనివారం చేరారు. పాంక్రియాటిక్‌ రుగ్మతతో బాధపడుతున్న ఆయనకు నిపుణులైన వైద్య బృందం పరీక్షలు జరిపి, చికిత్స చేస్తున్నట్లు ఎయిమ్స్‌ వర్గాలు తెలిపాయి.

పారికర్‌ ఢిల్లీ వెళ్ళే ముందు గోవా శాసన సభ సభాపతి ప్రమోద్‌ సావంత్‌, ఉప సభాపతి మైఖేల్‌ లోబోలతో భేటీ అయ్యారు. ఆయన తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను ఇతర మంత్రులకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పారికర్‌ను ఉప సభాపతి లోబో పనాజీకి సవిూపంలోని కండోలిమ్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కలిశారు. అనంతరం లోబో మాట్లాడుతూ పారికర్‌ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలను ప్రస్తుత మంత్రులకు శనివారం అప్పగించనున్నట్లు తెలిపారు. గోవా పరిపాలన సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 48 మంత్రిత్వ శాఖలను పంపిణీ చేస్తారని, ముఖ్యమైన ¬ం శాఖ, ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన పారికర్‌ తన వద్దే ఉంచుకుంటారని చెప్పారు.