ఎర్ర చందనం పట్టివేత
చేజర్ల, జనంసాక్షి: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పాత పాడు వద్ద ఈ తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న రూ. 5 లక్షల విలువ చేసే ఎర్ర చందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెంచలకోన అటవీ ప్రాంతం నుంచి జాతీయ రహదారి వైపు 30 ఎర్ర చందనం దుంగలతో వెళుతున్న వాహనాన్ని తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాన్ని అక్కడే వదిలి స్మగ్లర్లు పరారయ్యారని చెప్పారు.



