ఎస్ ఆర్ ఎస్పీ కాలువలో పడిన ఆటో: ఇద్దరి మృతి
వరంగల్: జిల్లాలోని పర్వతగిరి మండలం అన్నారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆటో ఎస్ఆర్ఎస్పీ కాలువలో ఆటో పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిక తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.