ఏకాగ్రతతో పరీక్ష రాసి అర్హత సాధించాలి.

సేవ దృక్పథంలో సాయిపూర్ యువత.
మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు
తాండూరు అగస్టు 28(జనంసాక్షి)ఏకాగ్రతతో పరీక్ష రాసి అర్హత సాధించాలని మున్సిపల్ వైస్
చైర్ పర్సన్ దీప నర్సింలు పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని కృష్ణవేణి ట్యాలెంట్ స్కూల్ పరీక్ష కేంద్రంలో కానిస్టేబుల్ పరీక్షకు హాజరైన విద్యార్థిని విద్యార్థు లకు సాయిపూర్ యువత పండ్లు, వాటర్ బాటిల్స్ ను అందజేసేకార్యక్రమం నిర్వహిం చారు.ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు పాల్గొని పండ్ల పంపిణీని ప్రారంభించారు.ఈ సందర్భంగా వైస్-చైర్ పర్సన్ దీప నర్సింలు మాట్లాడుతూ సాయిపూర్ ప్రాంత యువతకు ఇలాంటి మంచి సేవ దృక్పథంతో వారి సొంత డబ్బుల నిమిత్తం పరీక్ష కేంద్రానికి వచ్చిన అభ్యర్థులకు పండ్లు, వాటర్ బాటిల్స్ ను పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని వారిని కొనియాడారు.కానిస్టేబుల్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు శుభాశీస్సులు,అల్ ది బెస్ట్ తెలిపారు. మీ కష్టాన్ని వృధా కానివ్వకుండా ఏకాగ్రతతో పరీక్ష రాసి అర్హత సాధించాలని,.ప్రతీ ఒక్కరు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాసి మీ తల్లిదండ్రుల ఆశయాలను నిరవేర్చలని ఆమె పేర్కొన్నారు.