ఏపీకిచ్చిన హావిూలను నెరవేర్చాల్సిందే

– హావిూలు అమలయ్యే వరకు అండగా ఉంటాం
– జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : ఏపీకి ఇచ్చిన విభజన హావిూలను వెంటనే అమలు చేయాలని జేడీయూ మాజీ నేత శరద్‌యాదవ్‌ అన్నారు. సోమవారం ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా సాధన కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు శరద్‌యాదవ్‌ మద్దతు తెలిపారు. దీక్షా శిబిరానికి
వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రజల ధర్మ పోరాట దీక్షకు సంఘీభావం తెలుపుతున్నామన్నారు. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారని, ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలాగే అన్ని పక్షాలు ఏకమయ్యాయన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదలో పడిందని, అందుకే విపక్షాలు ఏకమవుతున్నాయని తెలిపారు. కోల్‌కతాలో మమతకు ఇలాంటి సంఘీభావమే తెలిపామని, పార్లమెంట్‌ సాక్షిగా ఆంధప్రదేశ్‌కు ఇచ్చిన హావిూలు నెరవేర్చాలన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరం ఏపీ విభజన హావిూలు నెరవేర్చే వరకు అండగా ఉంటామని శరద్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.
మోదీ సర్కార్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గర పడింది  – డెరిక్‌ ఒబ్రెయిన్‌
మోదీ సర్కార్‌కు ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గర పడిందంటూ టీఎంసీ సీనియర్‌ నేత డెరిక్‌ ఒబ్రెయిన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా భవన్‌లో సీఎం చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతు తెలిపిన ఆయన.. మోదీ, అమిత్‌ షాల చరిత్ర అందరికీ తెలుసునని.. మోదీ హటావ్‌ .. దేశ్‌ బచావ్‌ అన్నదే తమ లక్ష్యమన్నారు. రెండు నెలల్లో విూ ఎక్సపైరీ డేట్‌ పూర్తవుతుందని, విూ అడ్రస్‌ మారబోతోందని అన్నారు.  అన్ని రాష్ట్రాలను అవమానపరుస్తున్నారని, తాజా బడ్జెట్‌ లో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో రాబట్టుకొని.. రసగుల్లాలు ఇచ్చారని విమర్శించారు. అవికూడా పాచిపోయిన రసగుల్లాలు ఇచ్చారన్నారు. వీళ్లు ఫెడరలిజమ్‌ గురించి మాట్లాడతారని, పెద్దపెద్ద వాగ్దానాలు చేస్తారని, ఏవీ నిలబెట్టుకుంటారని, ఈ పోరాటం నాలుగేళ్ల క్రితమే మొదలైందన్నారు. 2018 జూలై 20న మాత్రం కీలక అడుగుపడిందని, ఆరోజు టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందిని, మోదీ చాలా భయపడ్డారన్నారు. గత నెల ఎస్పీ, బీఎస్పీ మైత్రి కుదిరిందని, 2019లో బీజేపీకి ముగింపు పలుకుతున్నామన్నారు. కోల్‌కతాలో 22 పార్టీల నేతలు.. ఒక్కటయ్యారని, సీబీఐ.. ఈడీలతో మేము భయపడమని, మోదీ, అమిత్‌ షా ద్వయం అవినీతికి తండ్రిలాంటివాళ్లన్నారు. బేటీ బచావ్‌.. బేటీ పడావ్‌ అంటూ గొప్ప పథకం తెచ్చారని, కానీ ఏడాదికి వంద కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్రానికి మూడు కోట్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. కానీ బెంగాల్‌లో కన్యశ్రీ పథకం తీసుకువచ్చామని, ఎంత కేటాయించామో తెలుసా రూ. 6500 కోట్లు అన్నారు. ఇది పార్టీల సమస్య కాదని, టీడీపీ పోరాటం కాదని, రాజ్యాంగం కోసం జరుగుతున్న పోరాటమన్నారు. దేశాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న పోరాటమని, అందరూ ఏకం కావాలంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
చంద్రబాబు లాంటి నేత ఉండటం.. ఏపీ వాళ్ల అదృష్టం – ములాయం
చంద్రబాబు నాయుడు లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల అదృష్టమని సమాజ్‌ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. తాము చంద్రబాబు పోరాటానికి మద్దతిస్తున్నామన్నారు. తనను ప్రధాని పదవికి ప్రతిపాదించి తనను ఎంతో గౌరవించారని గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. భారతదేశ చరిత్రలో చంద్రబాబు నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాభవన్‌లో జరుగుతున్న ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న ఆయన.. ‘సమాజ్‌ వాదీ మొత్తం చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తుందని స్పష్టంచేశారు. ఏ కార్యక్రమం చేపట్టినా.. విూతో పాటు ఉంటామని, విూరిచ్చిన గౌరవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. చంద్రబాబు బలహీన పడితే.. దేశ రాజకీయాలకు అంతమంచిది కాదని, అన్నీ పనులు వదిలి.. ఇక్కడికి వచ్చానన్నారు. ఆరోగ్యం బాగోలేదని డాక్టర్లు వారించినా.. చంద్రబాబు కోసం
వచ్చానని అన్నారు. ఇప్పుడు నాకు ఆనందంగా ఉందని, ఆయనకు మద్దతుగా నిలవడం అత్యంత ముఖ్యమన్నారు. ఆయనకు మద్దతుగా నిలుద్దామని, నాయుడేవిూ సామాన్య నేత కాదని, చంద్రబాబులాంటి నేత కలిగి ఉన్నందుకు ఆంధ్ర ప్రజలు అదృష్టవంతులన్నారు. ఆయన బతికి ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయన చేపట్టిన కార్యక్రమాలు సఫలం కావాలంటూ చంద్రబాబుకు తన పూర్తి సంఘీభావాన్ని ములాయం తెలిపారు.