ఏ.ఐ.టీ.యూ.సి. జనరల్ బాడీ సమావేశం

 

రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో (సింగరేణి కాలైరిస్ వర్కర్స్ యూనియన్), ఏఐటీయూసీ జనరల్ బాడీ సమావేశం ఆదివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జేబీసీసీఐ ఏఐటీయూసీ పర్మనెంట్ వేజ్ బోర్డు సభ్యులు, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ శ్వాసిరెడ్డి సీతారామయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సమావేశానికి పురస్కారించుకుని కా.వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణి లో మునుపెన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం, సంస్థలో ఆర్ధిక దోపిడీ ఎక్కువ అయ్యిందని అన్నారు. ఇలాగే కొనసాగితే సింగరేణి సంస్థ నష్టల్లోకి పోయి, బీ.ఐ.ఎఫ్.ఆర్. కి వెళ్లే ప్రమాదం ఉందని కార్మికులకు గుర్తు చేసారు. ఈ ఆర్ధిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయాలనీ అన్నారు. 11 వ వేజ్ బోర్డు ఆలస్యం అవుతున్నందున, కార్మికులు ఎవ్వరు నిరుత్సాహ పడకూడదని, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంచి మెరుగైన వేజ్ బోర్డు సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ జనరల్ బాడీ సమావేశంలో 5 ప్రధాన డిమాండ్ ల గురించి చర్చించుకోవడం జరిగింది. అందులో మొదటగా కోయగూడెం -3 బ్లాక్ ని ప్రైవేట్ కంపెనీ ఐనటువంటి అరబిందో కంపెనీ కి కేటాయించారని, తిరిగి సింగరేణి సంస్థ కి అప్పజెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అలాగే సింగరేణి లో కోల్ ఇండియా మాదిరిగా కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని అన్నారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కారించాలని కోరారు. అలాగే సింగరేణి సంస్థ 2021-22 వార్షిక సంవత్సరం లో సంస్థ కి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి, అందులో 35% వాటా కార్మికులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
సింగరేణి సంస్థ లో పని చేస్తున్న కార్మికులకు స్వంత ఇంటి పథకం కింద ప్రతీ కార్మికునికి 2 గుంటల భూమి, ఇల్లు కట్టుకోవడానికి 20 లక్షల వడ్డీ లేని ఋణం సంస్థనే ఇవ్వాలని అన్నారు. అలా వీలు కానీ పక్షంలో సంస్థ లో పని చేస్తున్న కార్మికులకు ఎవరి సింగరేణి క్వార్టర్ వారికే కేటాయించి, మిగిలిన క్వార్టర్ లని రిటైర్డ్ మెంట్ కార్మికులకు ఇవ్వాలని యాజమాన్యం ని డిమాండ్ చేయడం జరిగింది. కోల్ ఇండియా లో కార్మికులకు, సింగరేణి లో అధికారులకు ఇస్తున్న విధంగా పెర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ ని యాజమాన్యమే చెల్లించాలని తెలిపారు. మునుగోడు లో బీజేపీ లాంటి మత తత్వ పార్టీ తెలంగాణ రాష్ట్రము లో అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతోనే, తెరాస పార్టీ కి తప్పని పరిస్థితిలో మద్దతు ఇవ్వడం జరిగిందని, కానీ సింగరేణిలో మాత్రం ఎట్టి పరిస్థితులలో టీ.బీ.జీ.కే.ఎస్.కి మద్దతు ఇవ్వడం జరగదని, గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఒంటరిగా నే పోటీ చేస్తుందని కార్మికులకు ప్రత్యేకంగా తెలియజేసారు. అంతే కాకుండా సింగరేణి లో గుర్తింపు సంఘం ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం కావాలని వాయిదా వేస్తూ వస్తుందని,, అందుకే ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో హైకోర్టు ని ఆశ్రయించడం జరిగిందని, మరో 10 రోజుల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించే విధంగా హై కోర్ట్ తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సింగరేణి లో ఏఐటీయూసీ యూనియన్ ని భారీ మెజారిటీ తో గెలిపించుకోవడం కోసం కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి యం.డి అక్బర్ అలీ, ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య లు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, మన సింగరేణి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం సొమ్ము చేసుకోవటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ లు సురమళ్ళ వినయ్ కుమార్, ఏ. సంజీవ్, చీర్ల ముంకుద్, రాజ్ కుమార్, ఏ. ఆంజనేయులు,, ఆర్కేపీ1ఏ గని అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ గోవిందుల రమేష్,, కమిటీ సభ్యులు గాజుల రాయమల్లు ,సుంకరి గట్టయ్య , గోత్త గిరి ప్రసాద్, ఏలూరి శ్రీనివాస్, చెంద్రకాని రమేష్, మెడం బాల్ కోటి రెడ్డి, హుస్సేన్, వీరయ్య, మారం రాజు, బిక్షపతి, ఆరిఫ్, కృష్ణం రాజు, సిలివేరు హరీష్, నూనె అశోక్, కాటేపెల్లి రాజశేఖర్, ప్రశాంత్, రాం శంకర్, చిరంజీవి, కొల బాణయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, పూదరి రాజేష్, శ్రీధర్, నూనె రాజశేఖర్, ఏఐటీయూసీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు..