ఐఎన్‌ఎన్‌కు చేరిన సునీత

హ్యూస్టన్‌: భారత అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎన్‌ఎన్‌ ను చేరుకున్నారు. ఈ కేంద్రంలో వారు నాలుగు నెలల పాటు ఉంటారు. దాదాపు 30 ప్రయోగాలు నిర్వహిస్తారు. సునీతా విలియమ్స్‌తో పాటు రష్యాకు చెందిన సోయజ్‌ కమాండర్‌ యూరి మాలెన్‌ చెంకో, జపాన్‌ అంతరిక్ష సంస్థకు చెందిన ఫ్లైట్‌ ఇంజనీర్‌ అకిహికో హోషిడేలు ఆదివారం కజకస్థాన్‌లోని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి రోదసిలోకి పయనమైన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం 10.21 గంటలకు ఐఎన్‌ఎన్‌లోని రసావెట్‌ మాడ్యూల్‌తో సోయజ్‌ డాక్‌ అయ్యింది. తాజా యాత్ర సందర్భంగా మరో నాలుగు నెలల పాటు అంతరిక్షంలో గడపడం ద్వారా ఆమె తన రికార్డును మెరుగుపరచుకోనున్నారు.