ఐఏఎస్‌ల బదిలీ

` జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి
` 11 మంది అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో 11 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అర్వింద్‌ కుమార్‌ విపత్తు నిర్వహణశాఖకు బదిలీ అయ్యారు.విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా దానకిశోర్‌ నియమితులయ్యారు. ఆయనకు హెచ్‌ఎండీఏ, సీడీఎంఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి ఎండీగా సుదర్శన్‌రెడ్డి. వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా క్రిస్టినా ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కె.ఎస్‌. శ్రీనివాసరాజును నియమించారు. జీఏడీ కార్యదర్శిగా రాహుల్‌ బొజ్జాను నియమించారు. ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ, పర్యావరణశాఖ ముఖ్యకార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను నియమించారు. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్‌ జనరల్‌గా వాణిప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణ నియమితులయ్యారు.వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌గా టి.కె.శ్రీదేవి. నల్గొండ కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ బదిలీ అయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఆర్‌.వి.కర్ణన్‌ను నియమించారు.

 

ఐపీఎస్‌లు కూడా…
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు సీపీగా విశ్వప్రసాద్‌. సిట్‌, క్రైమ్‌ జాయింట్‌ సీపీగా ఏవీ రంగనాథ్‌ హైదరాబాద్‌ పశ్చిమ మండలం డీసీపీగా ఎస్‌.ఎం.విజయ్‌కుమార్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ డీసీపీగా జోయల్‌ డేవిస్‌ హైదరాబాద్‌ ఉత్తర మండలం డీసీపీగా రోహిణి ప్రియదర్శిని సీసీఎస్‌ డీసీపీగా ఎన్‌.శ్వేత. హైదరాబాద్‌ ట్రాఫిక్‌`1 డీసీపీగా ఎస్‌.సుబ్బరాయుడు. టాస్క్‌ఫోర్స్‌ డీసీపీగా ఉన్న నితికపంత్‌, సీసీఎస్‌లో జాయింట్‌ సీపీగా ఉన్న గజరావ్‌ భూపాల్‌, ఉత్తర మండల డీసీపీగా ఉన్న చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరితో పాటు మరో ఐదుగురు నాన్‌ కేడర్‌ ఎస్పీలను బదిలీ చేస్తూ హోం శాఖ నోట్‌ విడుదల చేసింది.