ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
దంతాలపల్లి, జనంసాక్షి: నరసింహులపేట మండలం దంతాలపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.