ఐపిఎల్ ప్రారంభం నుంచే మ్యాచ్ ఫిక్సింగ్
హైదరాబాద్, జనంసాక్షి: ఐపీఎల్-6 క్రికెట్ మ్యాచ్ ప్రారంభం నుంచే మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని ఢిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు. ఇవాళ ఆయన మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిన వీడియోక్లిప్పింగ్ మీడియాకు చూపించారు. ఐపీఎల్ ప్రారంభం నుంచే ప్లేయర్ల ఫోన్‌లను ట్యాప్ చేస్తున్నామని వివరించారు. ఒక ఓవర్లో ఎన్ని పరుగులు వచ్చేదో బుకీలకు ముందే తెలిసేదని ఆయన తెలిపారు. మొహాలీ మ్యాచ్‌లో శ్రీకాంత్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని వివరించారు. ఆట ప్రారంభానికి ముందే బుకీలు ప్లేయర్లను లుస్తున్నారని తెలిపారు.
ఇద్దరు విదేశీ ప్లేయర్లపై ఫోన్‌కాల్స్‌పై కూడా నిఘా పెట్టాలని అన్నారు. పిక్సింగ్ కాల్స్ అన్ని పాకిస్థాన్ నుంచి రూట్ అవుతున్నట్లు గుర్తించామన్నారు. క్రికెటర్లు స్టేడియం నుంచే కొన్ని సైగల ద్వారా సమాచారం అందిస్తారని కమిషనర్ పేర్కొన్నారు.