ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్‌లో కోల్పోయి ఒకరి మృతి
రెంజల్: నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని బోర్‌రామ్ గ్రామంలో ఐపీఎల్ మ్యాచ్ బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయి బెల్ల గంగాధర్ (40) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం, శుక్రవారం రాత్రి పంజాబ్, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందని గంగాధర్ రూ.5 వేలు బెట్టింగ్ కాశాడు. ఆ జట్టు ఓటమి పాలవడంతో డబ్బులు కోల్పోయాడు. ఈ విషయమై ఇంట్లో గొడల జరగడంతో అతను ఈ తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో తరచూ బెట్టింగ్‌లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.