*ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకం*

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి కళావతమ్మ
పాన్ గల్ సెప్టెంబర్ 10(జనం సాక్షి )
ఐలమ్మ పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పి కళావతమ్మ ఏఐటియుసి అధ్యక్షులు కే శ్రీరామ్ పిలుపునిచ్చారు.శనివారం కేతేపల్లిలో ఐలమ్మ 37వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విసునూరు రామచంద్ర రెడ్డి దురాగతాలు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిందని కమ్యూనిస్టులు ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం లో తుపాకీ పట్టి అడవుల్లో గెరిల్లా పోరాటం చేసిందన్నారు. భూములను పంటను దోచుకున్న దొరలపై తిరగబడిందన్నారు.తెలంగాణ పల్లెల్లో పేద ధనమాన ప్రాణాలను దోచుకుంటున్న దొరలను తరిమికొట్టి రైతు కూలీలకు అండగా నిలిచారన్నారు ఆమె కుటుంబ సభ్యులను చంపారు జైలు పాలు చేశారు అయినా బాంచన్ దొర నీ కాల్మొక్త అనే పేద ప్రజలలో ధైర్యం నింపి కర్రలు గుడ్డలు ఒడిసెలలు బాకులు గునపం పలుగు పారతో తిరగబడి వారిని తరిమేలా చేసిందన్నారు కూలి మహిళా రైతు సంఘాలను ఏర్పాటుచేసి సమస్యలపై పోరాడేందుకు పురిగొల్పిందన్నారు దొరలు దేశ్ముఖులు జాగీరుదారులు భూస్వాములు నిజాం తాబేదారుల భూములను గుంజి పేదలకు పంచడంలో సముచిత పాత్ర పోషించిందన్నారు.అక్షర జ్ఞానం లేని ఐలమ్మనే ఇవన్నీ చేయగలిగినప్పుడు నిర్బంధం లేని ప్రజాస్వామ్య కాలంలో మహిళా సమస్యల పరిష్కారానికి పోరాటంలో భయమెందుకు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు కాకం చిన్న నారాయణ, చిన్న కుర్మయ్య, కురువ హనుమంతు,ఎల్లమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు.