ఓటమికి మేము అర్హులమే
జట్టు కూర్పులో పొరపాటు జరిగింది
మ్యాచ్ ఓటమిపై కోహ్లీ విశ్లేషణ
లార్డ్స్,ఆగస్ట్13(జనం సాక్షి): రెండో టెస్టు మ్యాచ్ ఓటమికి అన్ని విధాల మేం అర్హులమే అని టీమిండియా కెప్టెన్ కోహ్లీ అంగీకరించాడు. జట్టు తుది జట్టు ఎంపికలో తప్పు జరిగిందని కోహ్లీ పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ లో జరిగిన భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ గెలిచిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విూడియాతో మాట్లాడారు.ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను భారత్ తుది జట్టుకు ఎంపిక చేయడంలోనే తప్పు జరిగిందని పేర్కొన్నాడు. దీంతోనే జోరూట్ సేన తమపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించిందని వివరించాడు. మేము ఆడిన తీరు తీవ్ర నిరాశజనకంగా ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లు సంచలన బౌలింగ్‌తో మాపై ఎదురుదాడికి దిగారు కానీ మా జట్టు కూర్పులోనే పెద్ద పొరపాటు జరిగిందని వివరించాడు. అదనపు సీమర్ లేకపోవడంతోనే ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలమయ్యామని తెలియజేశాడు. వెన్ను నొప్పితో కొంచెం ఇబ్బందిపడ్డానని, మూడో టెస్టుకు మధ్య ఉన్న విరామంతో కోలుకుంటానని ఆశిస్తున్నా అని విరాట్ కోహ్లి తెలిపాడు. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో భారత్ చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ ఓటమికి తాము అన్నివిధాలా అర్హులమే అని భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జట్టు ఎంపికలో తప్పుజరిగిందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మేము ఆడిన తీరు తీవ్ర నిరాశజనకంగా ఉంది. చివరి ఐదు టెస్టుల్లో తొలిసారి మేం గొప్పగా ఆడటంలో తేలిపోయాం. అదనపు సీమర్ లేకపోవడంతోనే ప్రత్యర్థులను కట్టడి చేయడంలో విఫలమయ్యాం. వెన్ను నొప్పితో కొంచెం ఇబ్బందిపడ్డా. మూడో టెస్టుకు మధ్య ఉన్న విరామంతో కోలుకుంటానని ఆశిస్తున్నా. అని విరాట్ వివరించాడు.