ఓటర్లే కీలకమని, కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు.
జనం సాక్షి ప్రతినిధిమెదక్, సెప్టెంబర్ 13, 2022
సమర్ధుడైన నాయకులను ఎన్నుకోవడంలో ఓటర్లే కీలకమని, కాబట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. గతంలో జనవరి 1 ప్రామాణికంగా 18 సంవత్సరాలు నిండిన యువతకు ఒక్కసారి మాత్రమే ఓటరుగా నమోదుకు అవకాశముండేదని, కానీ భారత ఎన్నికల కమీషన్ ఎక్కువ మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి ఏటా జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించుటకు సంవత్సరంలో నాలుగు పర్యాయాలు ఓటరు నమోదుకు అవకాశం కల్పించిందని అన్నారు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరు నైతికంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మంగళవారం స్వీప్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లోని ఆడిటోరియం లో వివిధ కళాశాలల అంబాసిడర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ ఎలక్టోరల్ లిటరసీ పై కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించడంతో పాటు బంధువులు,స్నేహితులకు ఓటు ప్రాముఖ్యతను వివరించి ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కలిగించాలన్నారు. ఫ్యూచర్ ఓటర్లు, యంగ్ ఓటర్లు, గ్రామీణ ఓటర్లు, ప్రభుత్వ , ప్రభుత్వేతర సంస్థలలో ఓటర్ల నమోదు పై అవాహాగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కాగా ఓటరు నమోదుకు కొత్తగా రూపొందించిన ఫారం-6 ను ఉపయోగించాలన్నారు. ఇది వరకే ఓటరు కార్డు ఉన్న వారు ఫారం 6-బి ద్వారా ఆధార్ కార్డు అనుసంధారం చేయాలని, అభ్యంతరాలుంటే ఫారం-7, చిరునామా మార్పు, సవరణలకు ఫారం-8 ఉపయోగించాలని సూచించారు. ప్రతి ఒక్క యువత ఓటరు హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, లేదా www.nvsp.in వెబ్ సైట్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించుటలో సహకరించవలసినదిగా ఆయన యువతకు సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరచిన క్యాంపస్ అంబాసిడర్లకు జాతీయ ఓటరు దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందజేస్తామని రమేష్ తెలిపారు.
రాజస్వ మండలాధికారి సాయి రామ్ మాట్లాడుతూ బ్లాక్ స్థాయి అధికారుల సహకారంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా కృషిచేయాలని అంబాసిడర్లకు సూచించారు.
స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్యాంపస్ అంబాసిడర్లకు ఓటరు నమోదుపై అవగాహన కలిగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషద్ సి.ఈ.ఓ. శైలేష్, ఈ.డి.ఏం.సందీప్, ఎలక్టోరల్ లిటరసి నోడల్ అధికారులు, క్యాంపస్ అంబాసిడర్లు తదితరులు పాల్గొ రూ